భారతదేశం, ఏప్రిల్ 2 -- Brahmamudi April 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రేఖకు ఐశ్వర్య గట్టి షాకే ఇవ్వబోతున్నట్లు తేలింది. ఇందుని రాజు ద్వారా కిడ్నాప్ చేయించి తనకు కావాల్సిన డబ్బును సంపాదించాలని భావిస్తుంది. అటు రాజు, లక్కీ కూడా సాహు భయంతో దీనికి ఒప్పుకుంటారు.

బ్రహ్మముడి సీరియల్ గురువారం (ఏప్రిల్ 2) ఎపిసోడ్ ఇందుకి అపర్ణ క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావ్.. ఆ రేఖ ఓ పాము.. రెండు మాటలు బాగా మాట్లాడి.. నాలుగు బట్టలు తెచ్చి తినిపిస్తే ఆమె గుణం మరచిపోయావా అని నిలదీస్తుంది. కానీ ఇందు మాత్రం రేఖ ఏం చేస్తుందో తనకు తెలుసు అని, తన పుట్టిన రోజు నాడు ఆస్తి పత్రాలపై సంతకం కోసమే ఇలా చేస్తోందని అంటుంది.

మరి సంతకం పెడతావా అని అపర్ణ అడుగుతుంది. మిమ్మల్ని కాపాడుకోవడమే తన లక్ష్యమని ఇందు చెబుతుంది. సంతకం పెట్టకుండా ...