భారతదేశం, ఏప్రిల్ 25 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇందును ఇంటికి తీసుకెళ్తాడు రాజ్. అది చూసి తల్లిదండ్రులు, వెంకీ తెగ షాక్ అవుతారు. రాత్రి వీడికోసం ఓ అమ్మాయి వచ్చింది. ఇప్పుడు వీడు ఇంటికే అమ్మాయిని తీసుకొచ్చాడని తండ్రి అంటాడు. ఈ ఎధవ నీకు ఎలా నచ్చాడమ్మా అని ఇందును అంటాడు రాజ్ తండ్రి.

అది కాదు నాన్న ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ కాదు అని రాజ్ చెబుతాడు. ఇంట్లో అందరిని ఇందుకు రాజ్ పరిచయం చేస్తాడు. దాంతో రాత్రి రాజ్ చెప్పింది ఇందు అంటుంది. అందరి గురించి గొప్పగా చెప్పి నా గురించి తక్కువ చేసి చెబుతావా అని రాజ్‌ను అంటాడు తండ్రి. తర్వాత ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని తండ్రి అడిగితే.. పెళ్లి అని రాజ్ అనేసరికి తండ్రి అరుస్తాడు. పెళ్లి చేసుకున్నాడట అని గోల చేస్తాడు.

వెంకీ, తల్లి కూడా పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని తిడ...