భారతదేశం, ఏప్రిల్ 1 -- Brahmamudi April 1st Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇందుని రేఖ మహారాణిలా చూసుకుంటుంది. అది చూసి ఇంట్లో వాళ్లు షాక్ తింటారు. అదే సమయంలో డ్రగ్స్ విషయంలో రౌడీల చేతుల్లో ఇరుక్కున్న రాజు, లక్కీ.. డబ్బు కోసం ఐశ్వర్య ఇచ్చిన ఇందు కిడ్నాప్ ఆఫర్ ను తీసుకునే ఆలోచనలో పడతారు.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఏప్రిల్ 1) ఎపిసోడ్ లో దుగ్గిరాల ఆస్తిని మొత్తం సొంతం చేసుకునేందుకు లాయర్ ను కలుస్తుంది రేఖ. ఇందుకి 18 ఏళ్లు నిండగానే ఆమె ఒక్క వేలిముద్రతో ఆస్తి మొత్తం మీ సొంతమవుతుంది.. పేపర్లన్నీ పకడ్బందీగా తయారు చేశాను.. ఒక్కసారి వేలిముద్ర వేసిన తర్వాత ఇందుయే కోర్టుకు వచ్చి కేసు వేసిన లాభం ఉండదు అని లాయర్ చెబుతాడు. తనకూ అదే కావాలని, ఇన్నేళ్లుగా ఈ ఆస్తి కోసమే ఎదురు చూస్తున్నానని రేఖ అంటుంది.

మరోవైపు రాజు, లక్కీ వెంట నందు, పోలీసుల...