భారతదేశం, ఏప్రిల్ 15 -- Brahmamudi April 15th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో పెద్ద ట్విస్టే ఎదురైంది. రూ.కోటి కోసం ఇందుని స్వరాజ్ కిడ్నాప్ చేస్తే.. అతని లొకేషన్ తెలుసుకొని అతని తమ్ముడు వెంకీని వెంటబెట్టుకొని అక్కడికి వస్తుంది నందు. ఆమెను చూసి రాజు, లక్కీ షాక్ తింటారు.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఏప్రిల్ 15) ఎపిసోడ్ బంటీకి స్వాతి ఫోన్ చేసే సీన్ తో మొదలవుతుంది. అక్క ఎక్కడ అని అడిగితే.. తాము కిడ్నాప్ చేయలేదని, కిడ్నాప్ చేసిన వాళ్లను అడగమని అనడంతో ఆమె షాక్ తింటుంది. అందరిలాగే ఆ రోజు ఆ పొగకి తాము నిద్రపోయామని, లేచి చూసేసరికి మీ అక్క కనిపించలేదని బంటీ అంటాడు. దీంతో స్వాతి కంగారు పడుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న అపర్ణ.. స్వాతిని లాగి పెట్టి కొడుతుంది.

ఇటు రాజుకి తండ్రి చలపతి ఫోన్ చేస్తాడు. ఆ సాహు గాడు మళ్లీ ఇంటికి చేపలు పార్శిల్ పంపిం...