భారతదేశం, ఏప్రిల్ 13 -- Brahmamudi April 13th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో తనను కిడ్నాప్ చేసింది తాను సెట్ చేసిన వాళ్లు కాదని, రాజు, లక్కీ అని ఇందు తెలుసుకుంటుంది. ఇటు ఇందు కిడ్నాప్ విషయం తెలుసుకున్న నందు.. ఆమెను కనిపెట్టే పని మొదలుపెడుతుంది. ఇందులో భాగంగా తన సొంతింటికి తిరిగి వస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (ఏప్రిల్ 13) ఎపిసోడ్ ఇందు కిడ్నాప్ గురించి పోలీసులు విచారించే సీన్ తో మొదలవుతుంది. ఇందుని ఎవరో తెలిసిన వాళ్లే కిడ్నాప్ చేసి ఉంటాడని ఎస్సై అనుమానిస్తాడు. దీంతో ఐశ్వర్య టెన్షన్ పడుతుంది. ఫామ్ హౌజ్ లో బర్త్ డే జరుపుతున్నామని కేవలం 24 గంటల ముందే డిసైడైనా ఆ విషయం కిడ్నాపర్లకు ఎలా తెలిసిందని ఎస్సై అడుగుతాడు. దీంతో రేఖలోనూ అనుమానం మొదలవుతుంది.

అఫీషియల్ గా కంప్లైంట్ ఇస్తే తాము విచారణ చేపడతామని అంటాడు. కానీ రేఖ మాత్రం అం...