భారతదేశం, ఆగస్టు 1 -- Spider Man Box Office Collection: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సూపర్ హీరో 'స్పైడర్ మ్యాన్' సరికొత్త చరిత్ర సృష్టించాడు. టామ్ హాలండ్ హీరోగా వచ్చిన మోస్ట్ అవైటెడ్ మార్వెల్ మూవీ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' థియేటర్లలో విడుదలై రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల నెట్ కలెక్షన్ల మైలురాయిని దాటేసి రికార్డులు తిరగరాసింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఇండియన్ సినీ ప్రేమికులు ఈ హాలీవుడ్ విజువల్ వండర్‌కి బ్రహ్మరథం పడుతున్నారు.

జులై 30న భారత్‌లో విడుదలైన స్పైడర్ మ్యాన్ సినిమా మొదటి రోజే ఏకంగా రూ.60.60 కోట్ల నెట్ వసూళ్లతో దేశంలోనే బిగ్గెస్ట్ హాలీవుడ్ ఓపెనర్‌గా నిలిచింది. ఇప్పటివరకు 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' పేరిట ఉన్న రూ.53.60 కోట్ల ఓపెనింగ్ రికార్డును టామ్ హాలండ్ సులువుగా దాటేశాడు.

రెండో రోజు వర్కింగ్ డే అయిన శుక్రవారం కూడా ఈ...