భారతదేశం, నవంబర్ 17 -- Box Office: కోవిడ్-19 మహమ్మారి, లాక్‌డౌన్‌ల కారణంగా ఒకప్పుడు కుదేలైన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ 2026లో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. రణబీర్ కపూర్ 'రామాయణం', రణవీర్ సింగ్ 'ధురంధర్ 2', సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' ఈ రికార్డు విజయంలో కీలక పాత్ర పోషించగా.. తెలుగు, కన్నడ చిత్రసీమలకు మాత్రం ఈ ఏడాది ఊహించని నిరాశ ఎదురైంది. 2026 బాక్సాఫీస్ పూర్తి విశ్లేషణ ఇక్కడ చూద్దాం.

2020, 2021 సంవత్సరాల్లో థియేటర్లు మూతపడి సినీ పరిశ్రమ భవిష్యత్తుపైనే నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ ఐదేళ్లలోనే అన్ని భాషల చిత్రసీమలు కలిసికట్టుగా సత్తా చాటాయి. 2023, 2024 సంవత్సరాల్లో ఇండియన్ సినిమాల ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ. 13,000 కోట్ల లోపే ఉండగా, 2025లో రూ. 15 వేల కోట్ల మార్కుకు కొద్ది దూరంలో ఆగిపోయింది.

అయితే 2026 ముగియడానికి ఇంకా ఆరు వారాల సమయం ఉండ...