భారతదేశం, ఆగస్టు 2 -- సికింద్రాబాద్‌లో బోనాల పండుగ వైభవంగా కొనసాగుతోంది. సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ చారిత్రక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అత్యంత భక్తిశ్రద్ధల నడుమ కన్నులపండువగా జరుగుతోంది. ఆదివారం ఈ వేడుకకు నగర నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు.

ఉదయం వేళల్లోనే ఎండ తీవ్రత 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరినప్పటికీ, భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన క్యూ లైన్లు ఆలయ చుట్టుపక్కల రోడ్ల వెంబడి దాదాపు కిలోమీటరు మేర సాగాయి.

భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటలకే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకోవడం ప్రారంభించారు. తెల్లవారుజామున వచ్చిన వారికి ఎలాంటి రద్దడి లేకుండా సులభంగా అమ్మవారి దర్శనం లభించింది.

అయితే, ఉదయం 8 గం...