భారతదేశం, నవంబర్ 20 -- Bold Web Series OTT: ఓటీటీలో రొమాంటిక్ కామెడీ, మోడ్రన్ ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి లారా దత్తా, ప్రతీక్ పాటిల్ బబ్బర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'హికప్స్ అండ్ హుకప్స్' (Hiccups And Hookups) ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.

వెబ్ సిరీస్ లతో జియోహాట్‌స్టార్ దూసుకెళ్తోంది. తాజాగా హికప్స్ అండ్ హుకప్స్ కూడా ఈ లిస్ట్ లో చేరింది. ఐఎండీబీలో 7.2 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ వెబ్ సిరీస్.. అమెరికన్ పాపులర్ హులు (Hulu) సిరీస్ 'క్యాజువల్' (Casual)కు ఇండియన్ రీమేక్. జియోహాట్‌స్టార్ తాజాగా ఈ సిరీస్‌ను తమ ప్లాట్‌ఫామ్‌లో చేర్చుతూ విడుదల చేసిన ప్రోమోలు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తున్నా...