భారతదేశం, మార్చి 19 -- టాలీవుడ్ ప్రేక్షకులను ఓటీటీలో కడుపుబ్బా నవ్విస్తోంది రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి. థియేటర్లలో ఓ మోస్తరు రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై మాత్రం భారీ రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌లో ఒక రేర్ మైలురాయిని చేరుకుంది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ ఓటీటీ తాజాగా గురువారం (మార్చి 19) అనౌన్స్ చేసిన డీటెయిల్స్ ప్రకారం.. ఈ ఫన్ రైడ్ ఏకంగా 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్‌ను క్రాస్ చేసి ట్రెండ్ సెట్ చేసింది. అంటే జనాలకు ఈ మూవీ ఎంతలా కనెక్ట్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు.

"ఈ ముగ్గురితో ఫన్, గందరగోళం, అయోమయం.. అలాగే ఏమాత్రం తగ్గని ఎండ్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పుడూ ఉంటుంది" అంటూ మేకర్స్ ఒక సూపర్ అప్‌డేట్‌ను ...