భారతదేశం, మే 30 -- Blue Moon Timings May 2026 : ఈసారి మే 31 పౌర్ణమి ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ రోజున మీరు ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తారు. జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రం రెండింటి దృక్కోణాల నుండి ఇది ఒక అరుదైన, ముఖ్యమైన సంఘటనగా పరిగణిస్తారు. ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వచ్చినప్పుడు, రెండో దానిని బ్లూ మూన్ అని పిలుస్తారు. ఈసారి చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటాడు, అందుకే దీనికి స్కార్పియో బ్లూ మూన్ అని పేరు వచ్చింది. మత విశ్వాసం ప్రకారం, ఈ రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, చంద్రుడిని పూజించడం చాలా ఫలప్రదం. భారతదేశంలో ఈ బ్లూ మూన్ ఏ సమయంలో కనిపిస్తుందో, ఈ సందర్భంగా పాటించాల్సిన పరిహారాలు ఏంటో చూడండి.

ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వచ్చినప్పుడు, రెండో పౌర్ణమిని బ్లూ మూన్ అంటారు. మే 2026లో మొదటి పౌర్ణమి నెల ప్రారంభంలో రాగా.. రెండో పౌర్ణమి మే ...