భారతదేశం, అక్టోబర్ 18 -- పర్యావరణ పరిరక్షణ కోసం కొందరు తమ సమయాన్ని, శ్రమను ధారపోస్తుంటే.. మరికొందరి బాధ్యతారాహిత్యం ఆ ప్రయత్నాలన్నింటినీ విఫలం చేస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువ పర్యావరణ వేత్త సురేంద్ర సింగ్ చౌదరికి సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సోషల్ మీడియాలో 'బిట్టూ తబాహి' పేరుతో నెటిజన్లకు పరిచితమైన ఈ యువకుడు, స్థానిక అజ్నార్ నదిని ఎనిమిది నెలలు కష్టపడి శుభ్రం చేశాడు. కాని ప్రజలు కొన్ని వారాల్లోనే ఆ నదిని 'చెత్త'మయం చేశారు. ఇక ఇప్పుడు చెత్త వేసేందుకు బిట్టూ రెండు డస్ట్​ బిన్లు ఏర్పాటు చేయగా.. ఒకటి కనిపించడం లేదు!

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా గుండా ప్రవహించే అజ్నార్ నది ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారంతో తీవ్రంగా కలుషితమైపోయింది. ఈ నదిని కాలుష్య కోరల నుంచి కాపాడాలని సంకల్పించిన బిట్టూ తబాహి.. ఒంటరిగానే నదిని శుభ...