భారతదేశం, సెప్టెంబర్ 5 -- సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం కొందరు విచిత్ర విన్యాసాలు చేస్తుంటే, మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక యువకుడు మాత్రం తన ఊరి నదిని కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాడు. నెలల తరబడి ఒంటరిగా పోరాడి, చెత్తాచెదారంతో నిండిపోయిన నదిని పునరుద్ధరించాడు. ఆ యువకుడి అంకితభావానికి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ పర్యావరణ సంస్థ 'ది ఓషన్ క్లీనప్' సీఈఓ బొయాన్ స్లాట్ అతడికి నేరుగా తమ సంస్థలో పనిచేసేందుకు ఆఫర్ ఇచ్చారు.

మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లా బియోరా ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల సురేంద్ర సింగ్ చౌదరి (బిట్టు తబాహిగా ప్రసిద్ధుడు) గత కొన్ని నెలలుగా అజ్నార్ నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, నాచును తొలగిస్తూ స్వచ్ఛమైన నదిగా మార్చాడు. నది పాత, కొత్త రూపాలకు సంబంధించిన ఫోటోలను ఒక ఎక్స్ (ట్విటర్) ...