భారతదేశం, జూలై 18 -- Aditya Dhar To Direct Lachit Borphukan Biopic: భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా చారిత్రక వీరుల బయోపిక్‌ల హవా నడుస్తోంది. ప్రాంతీయ వీరుల కథలను వెండితెరపై ఆవిష్కరించేందుకు దేశవ్యాప్తంగా దర్శకులు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈశాన్య భారత రక్షణ కోసం ప్రాణాలర్పించిన అహోం సైన్యాధ్యక్షుడు లచిత్ బోర్ఫుకాన్ వీరగాథను భారీ హిందీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న 'ధురంధర్' చిత్రాల దర్శకుడు ఆదిత్య ధర్ చేతుల్లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను పెట్టాలని అస్సాం ప్రభుత్వం భావిస్తోంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం నిర్వహించిన ఫేస్‌బుక్ లైవ్ సెషన్‌లో స్వయంగా వెల...