భారతదేశం, మార్చి 22 -- సంక్రాంతి 2026కు 'నారీ నారీ నడుమ మురారి' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శర్వానంద్ ఇప్పుడు 'బైకర్' అంటూ సందడి చేయబోతున్నాడు. సక్సెస్ అందుకున్న జోష్ లో బైకర్ తో థియేటర్లో మరోసారి అదగొట్టేందుకు వచ్చేస్తున్నాడు. ఈ బైకర్ మూవీ ట్రైలర్ ను ఇవాళ (మార్చి 22) రిలీజ్ చేశారు.

ఇండియాలోనే ఫస్ట్ మోటో క్రాస్ మూవీ 'బైకర్' అని మేకర్స్ చెప్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదివారం రిలీజైన ఈ సినిమా ట్రైలర్ అందుకు తగ్గట్లుగానే ఉంది. రేస్, యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ అదిరిపోయింది. ఇందులో శర్వానంద్ తండ్రి, మెంటార్ గా సీనియర్ హీరో రాజశేఖర్ నటించాడు.

ఇంటర్నేషనల్ ట్రాక్ లపై ఇండియన్ రేసర్లు పోటీపడగలరా? అనే ప్రశ్నతో బైకర్ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత శర్వానంద్ ఓ ఛాంపియన్ బైకర్ గా ఎంట్రీ ఇస్తాడు. రేసింగ్ సీక్వెన్స్ ...