భారతదేశం, జూన్ 7 -- Bigg Boss Telugu 10 Promo: విజయవంతంగా 9 సీజన్లు పూర్తి చేసుకున్న పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు.. ఇప్పుడు పదో సీజన్‌లోకి (Bigg Boss Telugu Season 10) గ్రాండ్‌గా అడుగుపెట్టబోతోంది. తాజాగా స్టార్ మా (Star Maa) విడుదల చేసిన అఫీషియల్ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

హౌస్ లోని కంటెస్టెంట్లతో ఆటలాడిస్తూ, మాటలతో వాతలు పెడుతూ, తనదైన హోస్టింగ్ తో దూసుకుపోతున్న కింగ్ నాగార్జునే ఈ బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ ను నడిపించనున్నాడు. ఎప్పటిలాగే హోస్ట్‌గా కింగ్ అక్కినేని నాగార్జున తన మార్క్ స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌తో ఎంట్రీ ఇచ్చి అంచనాలను స్కై హైకి తీసుకెళ్లారు. అయితే ఈ ప్రోమో కేవలం హంగామా కోసమే కాదు... ఈసారి ఆటలో రాబోయే ఒక మునుపెన్నడూ చూడని భారీ మార్పునకు గట్టి హింట్ కూడా ఇచ్చింది.

ప్రోమో ముగింపులో నాగార్జున చెప్పిన ఒక...