భారతదేశం, నవంబర్ 14 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ శ్వేత నాయుడు జర్నీ ముగిసినట్లు తెలిసింది. ఈ సీజన్ పదో వారంలో హౌస్ నుంచి ఆమె ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఈ ఎలిమినేషన్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ నుంచి ఈ వారం శ్వేత నాయుడు ఎలిమినేట్ అవుతుందనే విషయం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎందుకంటే వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చిన శ్వేత ఇంత త్వరగా ఎగ్జిట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. హౌస్ లో కూడా ఆమె యాక్టివ్ గానే కనిపించింది. కానీ ఈ సీజన్ లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న బిగ్ బాస్.. ఈ వారం శ్వేత ఎలిమినేషన్ తో మరో షాక్ ఇచ్చారని తెలిసింది.

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో నామినేషన్లలో ముఖేష్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణి, అమన్, నరేష్, సుధీర్, నీతు, రాంప్రసాద్,...