భారతదేశం, అక్టోబర్ 14 -- Bigg Boss Telugu 10: బుల్లితెర హిట్‌ రియాలిటీ షో బిగ్‌ బాస్ తెలుగు 10వ సీజన్ రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. ఆరో వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి హౌస్‌లో మునుపెన్నడూ లేనంతగా హీట్ పెరిగింది. ఈ వారం ఎలిమినేషన్ రేసులో నిలిచిన కంటెస్టెంట్ల జాతకాలు మారబోతున్నాయి. ముఖ్యంగా కొందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్లలోకి రావడంతో ఓటింగ్ లెక్కలు ఒక్కసారిగా తలకిందులవుతున్నాయి.

బిగ్ బాస్ తెలుగు 10లో ఆరో వారం నామినేషన్ల అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్న వారిలో టెంపర్ వంశీ, అమన్, వర్షిణి, రోహిత్, శాలిని, రాంప్రసాద్ ఉన్నారు. హౌస్‌లో జరిగిన గొడవలు, వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ హోరాహోరీగా సాగిన ఈ ప్రక్రియతో వీరంతా డేంజర్ జోన్‌కు చేరుకున్నారు. ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం ఈ ఆరుగురిలో కొందరికి భార...