భారతదేశం, అక్టోబర్ 16 -- Bigg Boss Apoorva: తెలుగు టీవీలో అత్యంత ఆదరణ పొందుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 (Bigg Boss Telugu 10) రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ నుంచి తాజాగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన కంటెస్టెంట్ అపూర్వ (Apoorva) షో నిర్వాహకులపై, తోటి హౌస్‌మేట్స్‌పై చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. హౌస్‌లో తన జర్నీ ముగిసిన తర్వాత బయటికి వచ్చిన ఆమె.. షోలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు.

కొన్ని వారాల పాటు తన ఆటతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించిన అపూర్వ.. హౌస్‌లో తనకు జరిగిన అన్యాయంపై ఘాటుగా స్పందించడం ఇప్పుడు బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నంతకాలం తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి గురించి అపూర్వ మాట్లాడుతూ.. తోటి హౌస్‌మేట్స్ తనను మాటలతో వేధించా...