భారతదేశం, అక్టోబర్ 18 -- Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజుకో మలుపు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని పంచుతోంది. ఉత్కంఠభరితమైన టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలతో సాగుతున్న ఈ షోలో.. తాజాగా ఈ వారం ఊహించని మెగా ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వారం బిగ్ బాస్ తెలుగు 10 హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వెళ్ళిపోతారని, డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి. కానీ, మేకర్స్ ప్రేక్షకులకు బిగ్ షాక్ ఇచ్చారని తెలిసింది. ఈ వారం నో ఎలిమినేషన్ అని సమాచారం. వైల్డ్ కార్డ్ ఎంట్రీల హడావుడి ముగిసిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఆరో వారం వీకెండ్ ఎపిసోడ్ లో హైడ్రామా సాగిందని టాక్. ఓటింగ్‌లో అత్యంత తక్కువ ఓట్లతో డేం...