భారతదేశం, అక్టోబర్ 1 -- Bigg Boss 10 Fight: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో ఊహించని దారుణం జరిగింది. నామినేషన్స్ వేడి తగ్గుముఖం పట్టకముందే కంటెస్టెంట్లు అమన్ మసూద్ (Aman Masud), త్రిగుణ్ (Thrigun) మధ్య జరిగిన తీవ్రమైన గొడవ హౌస్‌లో ఫిజికల్ ఎటాక్ వరకు వెళ్లింది. అసభ్యకర పదం వాడాడనే ఆరోపణలతో అమన్.. త్రిగున్‌‌పై చెయ్యి చేసుకోవడం సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది.

ఈ వారంలో అపూర్వ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హౌస్‌మేట్స్‌ను రెండు గ్రూపులుగా విభజించి ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఈ గేమ్ ఆడుతున్న సమయంలో అమన్.. త్రిగుణ్ మణికట్టును చాలా గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. నొప్పితో అరిచిన త్రిగున్.. అమన్ పదే పదే అలాగే చేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

వెంటనే పైకి లేచి అమన్ ముఖం ముందుకు వచ్చి గట్టిగా అరవడం ప్రారంభ...