భారతదేశం, అక్టోబర్ 10 -- Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో అపూర్వ జర్నీ ముగిసిందని సమాచారం. ఈ వారం ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతుందని తెలిసింది. వైల్డ్ కార్డు గా మూడో వారం హౌస్ లోకి వచ్చిన అపూర్వ.. అయిదో వారం ఎగ్జిట్ కావాల్సి రావడం గమనార్హం.

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు ఆదివారం ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో డబుల్ లేదంటే ట్రిపుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వీకెండ్ లో ఫస్ట్ అపూర్వ ఎలిమినేట్ అవుతుందని తెలిసింది.

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ అగ్ని పరీక్షలో అపూర్వ అదరగొట్టింది. కానీ బిగ్ బాస్ కొత్త సీజన్ లో ఫస్ట్ సెలెక్ట్ కాలేదు. అయితే ఆ తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగుపెట్టింది. మూడో వారంలో అపూర్వ, మిథిలేష్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్లుగ...