భారతదేశం, జూన్ 22 -- Bigg Boss 10: బిగ్ బాస్ అంటే పిచ్చి ఇష్టమా? ఒక్కసారైనా షోలో పార్టిసిపేట్ చేయాలనుందా? అందుకు తగ్గ టాలెంట్ మీలో ఉందా? ఆడిషన్ వీడియో పంపడం మిస్సయ్యారా? అయినా ఫీల్ అవాల్సిన అవసరం లేదు. మీలాంటి తెలుగు ఆడియన్స్ కోసం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మేకర్స్ మరో గోల్డెన్ ఆఫర్ తీసుకొచ్చారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి అగ్ని పరీక్ష పేరుతో కామనర్ల నుంచి కొంతమందిని షోకు సెలక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో మరోసారి అగ్ని పరీక్ష కోసం ఆడిషన్లు స్వీకరించారు. ఈ ఆడిషన్లు పంపాల్సిన టైమ్ ముగిసింది. వివిధ కారణాల వల్ల కొంతమంది ఆడిషన్లు పంపలేక ఫీల్ అవుతున్న వాళ్లూ ఉన్నారు.

బిగ్ బాస్ అగ్ని పరీక్ష కోసం ఆడిషన్లు పంపే మరో గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఈ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేశారు. యాం...