భారతదేశం, సెప్టెంబర్ 29 -- Bigg Boss Telugu 10 Trigun Vs Rohit Nagarjuna Reaction: టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా మారిన బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ రోజు రోజు రచ్చ రచ్చగా మారిపోతుంది. కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు, గొడవలు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి.

ఇక తాజాగా బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 28 ఎపిసోడ్‌లో అయితే త్రిగుణ్ వర్సెస్ రోహిత్ ఫైట్ మరి ఘోరంగా మారిపోయింది. బిగ్ బాస్‌లో ఈ వారం టోటల్ డామినేనష్ అనే అవతారాన్ని ప్రవేశపెట్టాడు బిగ్ బాస్. దీనికి సంబంధించి కొన్ని టాస్కులు ఇస్తాడు. అందులో గెలిచిన టీమ్ వారమంతా ఫుల్ డామినేషన్ చేయాల్సి ఉంటుంది.

ఇందులో భాగంగా మొత్తంగా 15 మంది హౌజ్ కంటెస్టెంట్స్‌ను రెండు టీమ్స్‌గా విభజించాడు బిగ్ బాస్. రెడ్ టీమ్ భైరవలో అపూర్వ, రోహిత్, అమన్, ఝాన్సీ, వర్షిణి, సుధీర్, రామ్ ప్రసాద్, వంశీ 8 మంది ఉంటే.....