భారతదేశం, మార్చి 8 -- బిగ్ బాస్ 17 కంటెస్టెంట్, ప్రముఖ యూట్యూబర్ అనురాగ్ దోభాల్ (UK07 Rider) మరోసారి ఆత్మహత్యాయత్నం చేయడం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో వేలాది మంది చూస్తుండగానే తన కారును వేగంగా పోనిచ్చి బారియర్‌ను ఢీకొట్టారు.

'ఇదే నా చివరి ప్రయాణం' అంటూ తన ఫాలోవర్లకు గుడ్ బై చెప్పి మరి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అనురాగ్ దోభాల్. ప్రస్తుతం అనురాగ్ దోభాల్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

ఘజియాబాద్‌లోని మసూరి ప్రాంతంలో ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై అనురాగ్ తన టయోటా ఫార్చ్యూనర్ కారులో వెళ్తూ లైవ్ స్ట్రీమింగ్ మొదలుపెట్టారు. ఆ సమయంలో సుమారు 80 వేల మంది ఆయనను చూస్తున్నారు.

అనురాగ్ దోభాల్ కన్నీళ్లు పెట్టుకుంటూ.. "వచ్చే జన్మలోనైనా నాకు ప్రేమను ఇవ్వు మమ్మీ.. నాకు ప్రేమ చాలా అవసరం" అంటూ ఎమోష...