భారతదేశం, మార్చి 31 -- బాలీవుడ్ వెర్సటైల్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ తన కెరీర్ ఆరంభం నుంచి బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తొలి సినిమా 'దమ్ లగా కే హయిషా' కోసం భారీగా బరువు పెరిగిన భూమి ఆ తర్వాత స్లిమ్ లుక్‌లోకి మారి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అయితే, ఇటీవల భూమి పెడ్నేకర్ మరింతగా బరువు తగ్గడంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఢిల్లీ' (IFFD) 2026 వేడుకల్లో పాల్గొన్న భూమి పెడ్నేకర్ తన ఫిట్‌నెస్ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బరువు తగ్గడం గురించి అడిగిన ప్రశ్నకు భూమి పెడ్నేకర్ ఎంతో పరిణతితో సమాధానమిచ్చారు. "చాలా ఏళ్లుగా సినిమాల కోసం బరువు పెరగడం, తగ్గడం చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు నా శరీరంపై నాకు శ్రద్ధ పెరిగింది. మహిళల్లో...