భారతదేశం, ఏప్రిల్ 21 -- Bhooth Bangla 4 Days Box Office Collection: దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ ద్వయం నుంచి వచ్చిన సినిమా కావడంతో 'భూత్ బంగ్లా'పై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. గత శుక్రవారం విడుదలైన ఈ హారర్ కామెడీ మూవీ, తొలిరోజే రూ. 12.25 కోట్ల కలెక్షన్స్‌తో ఓపెనింగ్ సాధించింది.

శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగి, భూత్ బంగ్లా సినిమాను సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లాయి. అయితే, ఏ సినిమాకైనా అసలైన పరీక్ష మొదటి సోమవారం (ఫస్ట్ మండే). ఈ పరీక్షలో అక్షయ్ కుమార్ పాస్ మార్కులు కొట్టేశారనే చెప్పాలి.

నాలుగో రోజు అంటే సోమవారం (ఏప్రిల్ 20) నాడు భూత్ బంగ్లా చిత్రం భారత్ వ్యాప్తంగా రూ. 6.75 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. సాధారణంగా వీకెండ్ తర్వాత కలెక్షన్లలో 50 శాతం కంటే ఎక్కువ తగ్గుదల కనిపిస్తుంది. కానీ ఈ సినిమా న...