భారతదేశం, నవంబర్ 27 -- Bhogi Twitter Review: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) తొలిసారిగా పూర్తిస్థాయి మాస్, రస్టిక్ అవతారంలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'భోగి' థియేటర్లలోకి అడుగుపెట్టింది. సంపత్ నంది దర్శకత్వంలో, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు.

1962 నాటి ఆదిలాబాద్ గిరిజన ప్రాంతం నేపథ్యంలో, పటేల్ అరాచకాలకు వ్యతిరేకంగా గంగ (శర్వానంద్) చేసే తిరుగుబాటు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ట్విటర్ (X) వేదికగా ప్రేక్షకులు, సినీ విశ్లేషకుల నుంచి మిశ్రమ, నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయి.

భోగి సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు, ఓవర్సీస్ రివ్యూయర్ల అభిప్రాయం ప్రకారం 'భోగి'లో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్లు ఇలా ఉన్నాయి....