భారతదేశం, అక్టోబర్ 9 -- Bhogi Eglivaranga Song: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మాస్ అండ్ రస్టిక్ యాక్షన్ అవతార్ లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'భోగి'. మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ రఫ్ అండ్ టఫ్ లుక్ తో అదరగొట్టగా, తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేశారు మేకర్స్.

సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఎగిలి వారంగా' పాటను అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో 1960ల కాలం నాటి పల్లెటూరి వాతావరణాన్ని, గ్రామీణ జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు ఈ పాటలో ఆవిష్కరించారు.

భోగి మూవీ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ సింగిల్ ఎగిలి వారంగా తొలిసారి వినగానే ఆకట్టుకునేలా ఉంది...