భారతదేశం, ఏప్రిల్ 30 -- Bhavana Dr Keerthi MBBS MS Teaser Release Event: తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోన్న మలయాళ స్టార్ హీరోయిన్ భావన. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మలయాళ సినిమా హంట్‌ను తెలుగులో "డాక్టర్ కీర్తి" అనే టైటిల్‌తో అనువాదం అవుతోంది. దీనికి ఎంబీబీఎస్ ఎంఎస్ అనేది క్యాప్షన్.

గోపాలకృష్ణ దొండపాటి సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ కీర్తి సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని సంచలనం సృష్టించిన కలకత్తాలోని జరిగిన డాక్టర్ రేప్ మర్డర్ నేపథ్యంగా తెరకెక్కించారు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని స్వర్ణ క్రియేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పీవీఆర్ సినిమాస్‌తో భారీ ఎత్తున మే 8న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం విశ్వనాథ్ రెడ్డి...