భారతదేశం, మార్చి 9 -- రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ నిరీక్షణ ముగిసింది. ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని జీ5 ఓటీటీ సోమవారం (మార్చి 9) అధికారికంగా వెల్లడించింది. ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ జనవరి 13న సంక్రాంతి సందర్భంగా రిలీజైంది. ఇప్పటికే అన్ని సంక్రాంతి సినిమాలు ఓటీటీలోకి వచ్చేయగా.. మొత్తానికి ఈ శుక్రవారం (మార్చి 13) నుంచి రవితేజ నటించిన ఈ సినిమా కూడా స్ట్రీమింగ్ కు వస్తోంది.

"నిరీక్షణ ముగిసింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ వచ్చేసింది. మార్చి 13న జీ5లో స్ట్రీమింగ్" అవుతుంది అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఒక నిమిషం 10 సెకన్లు ఉన్న మూవీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసింది.

ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా పేరున్న కిష...