భారతదేశం, జూన్ 10 -- Bharathiraja Passed Away: తమిళనాడు చిత్ర సీమలోనే కాకుండా, యావత్ భారత సినీ పరిశ్రమకు షాక్. దక్షిణ భారత చలనచిత్ర రంగాన్ని స్టూడియోల నాలుగు గోడల నుంచి పల్లెటూరి పచ్చదనం, మట్టి వాసనల వైపు నడిపించిన "రియలిజం పితామహుడు", దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) బుధవారం (జూన్ 10) చెన్నైలో కన్నుమూశారు. వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యల వల్ల ఆయన తుదిశ్వాస విడిచారు.

దిగ్గజ దర్శకుడు, తన సినిమాలతో ఇండియన్ సినీ హిస్టరీలో చెరగని ముద్ర వేసిన పితామహుడు భారతీరాజా ఇక లేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.

ఇటీవల విజయ్ సేతుపతి 'మహారాజా' చిత్రంలోనూ, మోహన్ లాల్ 'తుడరుమ్' (2025) లోనూ నటుడిగా అలరించిన భారతీరాజా మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు సినిమా రూ...