భారతదేశం, ఏప్రిల్ 28 -- Veteran Actor Bharat Kapoor Death: బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు భరత్ కపూర్ సోమవారం (ఏప్రిల్ 27) సాయంత్రం ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మరణవార్తను సన్నిహితుడు, నటుడు అవతార్ గిల్ ధ్రువీకరించారు.

మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో వెటరన్ యాక్టర్ భరత్ కపూర్ మరణించినట్లు ఆయన కుమారుడు రాహుల్ వెల్లడించారు. గడిచిన మూడు రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

80, 90వ దశకాల్లో భరత్ కపూర్ అంటే విలన్ పాత్రలకు పెట్టింది పేరు. అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో ఆయన పోషించిన ప్రతినాయక పాత్రలు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

'ఆఖ్రీ రాస్తా', 'బర్సాత్', 'నూరీ', 'రామ్ బలరామ్', 'ఇంకార్' వంటి చిత్రాల్లో భరత్ కపూర్ చూ...