భారతదేశం, జూలై 13 -- Bhagyashri Borse: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్, ఈ మధ్యే లెనిన్ తో మరో సక్సెస్ అందుకున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తాజాగా చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. గ్లామర్ ఫీల్డ్‌లో స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పి కన్నీళ్లు తెప్పించింది. పక్కా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఇంతటి సక్సెస్ సాధించడం వెనుక ఉన్న బాధ గురించి సోషల్ మీడియా వేదికగా ఓపెన్ అయింది.

సినిమాల్లో హీరోయిన్ల లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ అక్కడికి చేరుకోవడానికి వాళ్లు పడే కష్టం అంతాఇంతా కాదు. భాగ్యశ్రీ బోర్సే కూడా అలాంటి ఎన్నో కష్టాలు అనుభవించి వచ్చినట్లు తాజాగా ఆమె కామెంట్స్ ను బట్టి తెలుస్తోంది. ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో తన గతాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె చేసిన హార్ట్ టచింగ్ ...