భారతదేశం, మే 24 -- Bhagyashree: మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'రాజా శివాజీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ప్రతిష్టాత్మక మరాఠీ చిత్రం థియేటర్లలో రికార్డు వసూళ్లు సాధిస్తూ రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో శివాజీ మహారాజ్ వీరమాత రాజమాత జిజాబాయి పాత్రను బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ పోషించింది.

రాజా శివాజీ మూవీలో రితేష్ దేశ్‌ముఖ్‌కు తల్లిగా భాగ్యశ్రీ నటించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. నిజజీవితంలో రితేష్ కంటే భాగ్యశ్రీ కేవలం పదేళ్లు మాత్రమే పెద్ద అయినప్పటికీ ఆమె తల్లి పాత్రను అంగీకరించడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ ఈ విషయంపై స్పందించింది. "మనం చిన్నప్పటి...