భారతదేశం, మార్చి 22 -- భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ సహజత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా అభివృద్ధి పనులు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తిగా ఆగమ శాస్త్రానుసారం చేపట్టాలని సూచించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి శనివారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇప్పటి వరకు పూర్తయిన భూసేకరణకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనుల నిర్వహణ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. మూడు దశల్లో పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ...