భారతదేశం, జూలై 6 -- Best Spy Thrillers: యాక్షన్-ప్యాక్డ్ ఇంటెలిజెన్స్ డ్రామాల నుండి మైండ్ గేమ్స్‌తో సాగే సైకోలాజికల్ థ్రిల్లర్స్ వరకు ఎన్నో క్రేజీ షోలు జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అనుభూతిని ఇచ్చే ఆ టాప్-7 సిరీస్‌ల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

ప్రధాన తారాగణం: కే కే మీనన్, కరణ్ టాకర్, వినయ్ పాఠక్.

స్టోరీ: సీనియర్ రా అధికారి హిమ్మత్ సింగ్, అతని నైపుణ్యం కలిగిన అండర్ కవర్ ఏజెంట్ల బృందం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. భారతదేశంలో జరిగిన పలు తీవ్రవాద దాడుల వెనుక ఉన్న మాస్టర్‌మైండ్‌ను పట్టుకోవడానికి వీరు చేసే రహస్య మిషన్లు ఉత్కంఠ రేపుతాయి.

మొదటి సీజన్ విజయవంతం కావడంతో హిమ్మత్ సింగ్ ప్రారంభ రోజులపై ఒక ప్రీక్వెల్, ఆపై రీసెంట్‌గా (2025లో) సీజన్ 2 కూడా వచ్చింది. సీజన్ 2లో భారతదేశపు యూపీఐ (UPI) ఆధారిత ఆర్థిక వ్యవస్థను క్రాష్ ...