భారతదేశం, జనవరి 26 -- భారత ఆటోమొబైల్ మార్కెట్​లో కియా ఇండియా మరో అద్భుతమైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఒకటిగా పేరుగాంచిన 'కియా సోనెట్'.. తాజాగా 5 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది.

కియా కంపెనీ దేశీయ వృద్ధిలో సోనెట్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ సాధిస్తున్న మొత్తం విక్రయాల్లో కేవలం ఈ ఒక్క మోడల్ వాటాయే దాదాపు 35 శాతంగా ఉండటం విశేషం.

భారత్‌లోనే తయారవుతున్న సోనెట్.. ఇక్కడ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం దేశాలకు ఎగుమతి అవుతోంది. మిడిల్​ ఈస్ట్​, ఆఫ్రికా, మధ్య- దక్షిణ అమెరికా, మెక్సికోతో పాటు ఆసియా పసిఫిక్ మార్కెట్లలోనూ ఈ కారు దూసుకుపోతోంది. సెల్టోస్, కార్నివాల్ తర్వాత 2020 సెప్టెంబర్‌లో కియా నుంచి వచ్చిన మూడొవ మో...