భారతదేశం, మార్చి 27 -- ఒకప్పుడు భారత రోడ్లపై ఎస్‌యూవీ అంటే డస్టర్ అనేలా పేరు తెచ్చుకున్న రెనాల్ట్, ఇప్పుడు తన నెక్ట్స్​ జనరేషన్ మోడల్‌తో మళ్లీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగుతున్న హ్యుందాయ్ క్రెటాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కొత్త డస్టర్ రూపుదిద్దుకుంది! మరి ఈ రెండు ఫ్యామిలీ ఎస్​యూవీల్లో ఏది బెస్ట్? ఏయే అంశాల్లో ఏది పైచేయి సాధించిందో ఓసారి విశ్లేషిద్దాం.

2026 రెనాల్ట్​ డస్టర్ పాత మోడల్ కంటే మాత్రమే కాదు, క్రెటా కంటే కూడా పెద్దదిగా ఉంది!

పొడవు: డస్టర్ 4,346 ఎంఎం (క్రెటా కంటే 16 ఎంఎం ఎక్కువ).

వెడల్పు: 1,815 ఎంఎం (క్రెటా కంటే 25 ఎంఎం ఎక్కువ).

ఎత్తు: 1,703 ఎంఎం (క్రెటా కంటే 68 ఎంఎం ఎక్కువ).

వీల్‌బేస్: 2,657 ఎంఎం (క్రెటా కంటే 47 ఎంఎం ఎక్కువ).

దీనివల్ల కారు లోపల క్యాబిన్ స్థలం మెరుగ్గా ఉంటుంది. ఇక లగేజ్...