భారతదేశం, ఏప్రిల్ 18 -- Simple Ultra Vs Ather 450 Apex : భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ ఇప్పుడు కేవలం 'సిటీ డ్రైవింగ్'కు మాత్రమే పరిమితం కావడం లేదు. వేగం, రేంజ్, స్టైల్ కోరుకునే వారి కోసం కంపెనీలు ప్రత్యేకమైన మోడళ్లను రంగంలోకి దించుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల లాంచ్ అయిన 'సింపుల్ అల్ట్రా', ఇప్పటికే క్రేజ్ సంపాదించుకున్న 'ఏథర్ 450 అపెక్స్' మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

ధర విషయంలో సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్​ స్కూటర్ కాస్త ఖరీదైనదిగా కనిపిస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 2.34 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని భారీ బ్యాటరీ, రేంజ్ కారణంగా ఈ స్థాయిలో ధరను నిర్ణయించారు.

మరోవైపు, ఏథర్ 450 అపెక్స్ ధర రూ. 1.89 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ప్రీమియం విభాగంలో ఉన్నప్పటికీ, సింపుల్ అల్ట్రాతో పోలిస్తే ఇది కొంత అందుబాటులో ...