భారతదేశం, సెప్టెంబర్ 1 -- దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ఏథర్ ఎనర్జీ సరికొత్త సంచలనానికి తెరలేపింది. తమ సరికొత్త ఈఎల్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన 'కోనార్క్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.99,999 ప్రారంభ ఎక్స్​షోరూం ధరకు విడుదల చేసింది. ఇప్పటివరకు రూ.లక్షకు పైగా బడ్జెట్ ఉన్న ప్రీమియం విభాగంలోనే దృష్టి పెట్టిన ఏథర్, ఇప్పుడు సాధారణ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ బడ్జెట్ స్కూటర్‌ను తీసుకొచ్చింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ప్రతిరోజూ ఆఫీసులకు, వ్యాపారాలకు వెళ్లే సామాన్యులకు పెట్రోల్ భారం రోజురోజుకూ పెరుగుతోంది. నెలకు వేల రూపాయలు ఇంధనానికే వెచ్చించలేక ఇబ్బంది పడే మధ్యతరగతి ప్రయాణికులకు ఈ తక్కువ ధర ఈవీ ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారనుంది. అయితే, ఇప్పటికే భారత మార్కెట్లో సత్తా చాటుతున్న టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ స్కూటర్లకు ...