భారతదేశం, మార్చి 20 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' మార్చి 19 థియేటర్లలోకి వచ్చేసింది. మొదటి రోజే దేశవ్యాప్తంగా థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కనిపించింది.

ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ గోపాల్ వర్మ వంటి స్టార్లు ధురంధర్ ది రివేంజ్ సినిమాను మెచ్చుకోగా తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా ధురంధర్ 2పై తన రివ్యూ ఇచ్చారు.

"గత రాత్రి 'ధురంధర్ 2' చూశాను.. ఇదొక అద్భుతమైన అనుభవం! సినిమాలో ఇంటెన్సిటీ, ఎమోషన్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. రణ్‌వీర్ సింగ్ బ్రదర్.. ప్రతి ఫ్రేమ్‌లో నీ విశ్వరూపం చూపించావు. తెలుగు ప్రేక్షకులతో నీకు ఏర్పడిన బాండింగ్ నెక్ట్స్ లెవల్‌లో ఉ...