భారతదేశం, జూన్ 29 -- Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నార్త్ ఇండియాలో ఉన్న తన అన్‌స్టాపబుల్ క్రేజ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'జయ జానకి నాయక' సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ 'ఖూన్‌ఖార్' ఇప్పుడు యూట్యూబ్‌లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

పెన్ మూవీస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన ఈ పూర్తి సినిమా ఏకంగా 1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ మైల్‌స్టోన్‌ను దాటేసి టాలీవుడ్ హిస్టరీలోనే సరికొత్త సంచలనంగా నిలిచింది.

టాలీవుడ్‌కు చెందిన ఎంతోమంది టాప్ స్టార్ల సినిమాలు హిందీలోకి డబ్ అయి యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్ సాధించాయి. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క తెలుగు హీరో పూర్తి నిడివి సినిమాకు కూడా యూట్యూబ్‌లో 100 కోట్ల వ్యూస్ రాలేదు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అ...