భారతదేశం, మార్చి 9 -- టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. గత కొంతకాలంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి గురించి వస్తున్న వార్తలకు తెరదించుతూ, కావ్య రెడ్డి అనే అమ్మాయితో తన బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

అయితే, ఈపాటికే కావ్య రెడ్డి అనే యువతితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్ జరిగిందని కథనాలు వచ్చాయి. కానీ, నిజానికి నిశ్చితార్థం జరగలేదని, అది కేవలం ఒక చిన్న ఫ్యామిలీ అనౌన్స్‌మెంట్ మాత్రమే అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అధికారికంగా చెప్పాడు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికీ 'రోకా' (Roka) వేడుక ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫొటోలు పంచుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ ఫొటోలు షేర్ చేస్తూ కావ్య ...