భారతదేశం, జూలై 25 -- BDL Hyderabad Apprentice 2026 : కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతిష్టాత్మక రక్షణ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), హైదరాబాద్‌ లో అప్రెంట్రిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొత్తం 147 అప్రెంటిస్ ఖాళీలున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

మొత్తం 147 ఖాళీల్లో 122 గ్రాడ్యుయేట్ (బీఈ/బీటెక్) అప్రెంటిస్ పోస్టులు, 25 డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. ట్రేడుల వారీగా ఖాళీలు, చెల్లించే స్టైపెండ్ వివరాలు కింది విధంగా ఉన్నాయి..

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.10,900 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. ఈ మొత్తం స్టైపెండ్‌లో 50 శాతం బీడీఎల్ నేరుగా ఇస్తుండగా.. మిగిలిన 50 శాతాన్ని బోర్...