భారతదేశం, అక్టోబర్ 25 -- Baththa OTT: విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్, కామెడీ డ్రామా 'బత్తా' (Baththa) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 1, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు రెడీ అయింది.

బత్తా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. అక్టోబర్ 29, 2026 నుంచి ఈ బత్తా సినిమా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో అధికారికంగా స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకురానుంది.

1986 మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో ఈ బత్తా సినిమా కథ నడుస్తుంది. బత్తా (విజయ్ సేతుపతి) ఒక క్రూరమైన లోకల్ గ్యాంగ్‌స్టర...