భారతదేశం, మే 1 -- Bathroom Videos: శ్రీలంక క్రికెట్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. మైదానంలో ఆట కంటే ఆటగాళ్ల ప్రవర్తన వల్లే శ్రీలంక బోర్డు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా లంక అండర్-19 జాతీయ జట్టుకు చెందిన ఇద్దరు సభ్యులు అత్యంత జుగుప్సాకరమైన రీతిలో ప్రవర్తించి కటకటాల పాలయ్యారు.

నారహేన్‌పిటలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో కొంతమంది మహిళా వైద్యులు వృత్తిపరమైన కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు బస చేశారు. అదే సమయంలో అక్కడ ఉంటున్న ఇద్దరు శ్రీలంక అండర్-19 క్రికెటర్లు.. లేడీ డాక్టర్లు స్నానం చేస్తుండగా బాత్‌రూమ్ కిటికీల గుండా తమ మొబైల్ ఫోన్లతో రహస్యంగా వీడియోలు తీశారు. దీనిని గమనించిన బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ ప్లేయర్లు కేవలం మహిళా వైద్యులనే ...