Basara temple : జూలై 27 నుంచి 29 వరకు బాసరలో వ్యాస పౌర్ణమి ఉత్సవాలు
భారతదేశం, జూలై 26 -- దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి, వసంత పంచమి వేడుకల తరహాలోనే వ్యాస పౌర్ణమి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. జూలై 27 నుండి 29 వరకు మూడు రోజుల పాటు వ్యాస పౌర్ణమి ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ అధికారులు అధికారికంగా వెల్లడించారు. వేద, ఆధ్యాత్మిక దృక్పథంలో ఎంతో విశిష్టమైన ఈ వార్షిక వేడుకలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.
బాసర క్షేత్రానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉంది. కురుక్షేత్ర యుగ ముగింపు తర్వాత ప్రశాంతత కోసం వేద వ్యాస మహర్షి తన శిష్యులతో కలసి గోదావరి తీరంలో ప్రశాంతమైన వాతావరణంలో తపస్సు ఆచరించిన ప్రదేశమే ఈ బాసరగా ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.