భారతదేశం, నవంబర్ 1 -- ఐడీబీఐ బ్యాంక్ ఖాతాదారులకు ఒక అత్యవసర సమాచారం! నవంబర్ 2, నవంబర్ 3 (2026) తేదీల్లో అంటే రేపు, ఎల్లుడి బ్యాంకింగ్ సేవలకు ఆటంకం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ డిమాండ్ల సాధనకై బ్యాంక్ ఉద్యోగ సంఘాలు రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.

ఈ నేపథ్యంలో బ్రాంచ్ స్థాయి సేవలకు ఇబ్బందులు ఎదురుకావచ్చని గ్రహించిన యాజమాన్యం తమ కస్టమర్లను ముందుగానే అలర్ట్ చేసింది. బ్యాంక్ శాఖలకు వెళ్లి పూర్తి చేసుకోవాల్సిన అత్యవసర లావాదేవీలు, డాక్యుమెంట్ల సమర్పణ లేదా ఇతర ఖాతా సంబంధిత సమస్యలను ఈ తేదీల తర్వాత పూర్తి చేసుకోవాలని కస్టమర్లకు సూచించింది.

ఉద్యోగ సంఘాల నుంచి సమ్మె నోటీసు అందిందని, అయితే సమ్మెకు గల పూర్తి కారణాలను సంస్థ వెల్లడించనప్పటికీ, కస్టమర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఐడీబీఐ బ్యాంక్ అక్టోబర్ 31న తన అధికారిక 'ఎక్స...