భారతదేశం, జూలై 5 -- Bandla Ganesh vs Prakash Raj: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ 'ప్రశ్న రావణ్' వరుస అరెస్టుల పరిణామాలపై నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడ్డాడు. దీనికి కౌంటర్ గా బండ్ల గణేష్ పెట్టిన ఘాటు కౌంటర్ సంచలనంగా మారింది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన రావణ్‌కు కోర్టు వరుసగా 4 సార్లు బెయిల్ మంజూరు అయింది. అయితే పోలీసులు వెంటనే 5వ సారి (యూఏపీఏ - UAPA చట్టం కింద) అరెస్ట్ చేయడాన్ని ప్రకాష్ రాజ్ తప్పుపట్టాడు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (@ncbn), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (@PawanKalyan) లను ట్యాగ్ చేస్తూ.. "4వ సారి బెయిల్.. మళ్లీ ఐదోసారి అరెస్ట్.. ఇది కోర్టులను అపహాస్యం చేయడమే. ప్రజలంతా గమనిస్తున్నారు. ప...